జగన్ సమాధానం చెప్పాలి.. బుద్దా వెంకన్న

  • 2 years ago
అవినీతి గురించి సీఎం జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. రూ.42వేల కోట్లు ఈడీ జప్తు చేస్తే.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ మారారన్నారు. లిక్కర్, ఇసుక అక్రమాల ద్వారా రూ.కోట్లు జగన్కు చేరుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో జగనే చెప్పాలన్నారు. ఉద్యోగులపై కక్ష సాధించేందుకే యాప్ అని బుద్దా వెంకన్న ఆరోపించారు.

Recommended