#Ricewater బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు ఎన్నో...#Hair #Skin #Vitamins
  • 5 years ago
Many uses of rice washed water,

బియ్యం కడిగిన నీరే కదా.. అని పారబోసేస్తున్నారా? కాస్త ఆగండి. బియ్యం కడిగిన నీటిని చర్మ, కేశ సంరక్షణకు ఉపయోగించుకోవచ్చుననే విషయం తెలుసుకోండి. ఎలాగంటే? బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టి ఆపై కడిగేయాలి.


బియ్యం కడిగిన నీటిని వడగట్టి.. ముఖానికి రాసుకోవడం, జుట్టుకు రాసుకోవడం చేయాలి. పావు గంట తర్వాత స్నానం చేస్తే.. చర్మానికి మేలు చేకూరుతుంది. ఇంకా జుట్టు పెరుగుతుంది.

బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని కడిగితే మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. చర్మం ప్రకాశవంతమవుతుంది. రోజుకోసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడిబారినట్లు కనిపిస్తే.. బియ్యం కడిగిన నీటిని మాడుకు జుట్టుకు పట్టించి 15 నిమిషాలకు తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. #RawRiceWater #Health #HairCare

మరిన్ని వివరాలకు చూడండి https://telugu.webdunia.com/ ట్రెండ్స్, లేటెస్ట్ వివరాల కోసం ఫాలో అవండి. https://www.facebook.com/Webdunia-Telugu-190322267658012/ ట్రెండ్స్,. విశేషాల కోసం చూడండి https://studio.helo-app.com/profile/myposts