IPL Final 2019: Do You Know How Much Prize Money Will Winners & Runners Up Take Home???
  • 5 years ago
IPL Final 2019: The Indian Premier League (IPL) 2019 season is about to end. Chennai Super Kings (CSK) and Mumbai Indians (MI) will go up against each other for the title and the prize money of Rs 20 crore.
#ipl2019
#iplfinal
#cskvmi
#msdhoni
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
#rohitsharma

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లు... ఈ మ్యాచ్‌లో నెగ్గే జట్టు నాలుగో సారి టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.ఐపీఎల్ 2019 విన్నింగ్ జట్టుకు ఎంత పారితోషికం ఇస్తారు అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించిన పారితోషికం అధికారిక సమాచారం ప్రకారం టోర్నీ టైటిల్ విన్నర్ ‌జట్టుకు అక్షరాలా రూ.20 కోట్ల సొమ్ము సొంతం కానుంది. అంతే కాదు రన్నర్ అప్ జట్టుకు సైతం రూ.12.5 కోట్ల భారీ పారితోషికం అందనుంది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుతో పాటు, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు సైతం ప్రత్యేకంగా ప్రైజ్ మనీ అందించనున్నారు. ఇదిలా ఉంటే విన్నింగ్ జట్టు సొంతం చేసుకున్న రూ.20 కోట్ల ప్రైజ్ మనీలో దాదాపు 50 శాతం డబ్బు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుంది. మిగితా డబ్బును జట్టు సభ్యులతో పాటు ఇతర బృంద సభ్యులకు పంచుతారు. అంతేకాదు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న బ్యాట్స్ మెన్‌కు రూ.10 లక్షల ప్రైజ్ మనీ దక్కనుంది. అయితే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోదాలో 692 పరుగులు సాధించి అందనంత ఎత్తులో ఉన్న సన్ రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కు ఈ ప్రైజ్ మనీ దాదాపు ఖాయమనే చెప్పవచ్చు.
Recommended