New Zealand vs Bangladesh: Taylor Became New Zealand's Top Run-Scorer In ODIs | Oneindia Telugu
  • 5 years ago
Ross Taylor became New Zealand's all-time leading run-scorer in one-day internationals during Wednesday's match against Bangladesh.Taylor scored 69 off 81 balls as the Black Caps cruised to 330/6 aftr losing the toss and being sent in bat,with henry nicholls and tom latham also making half centuries.
#newzealandvsbangladesh2019
#rosstaylor
#newzealand
#odicricket
#bangladesh
#henrynicholls
#tomlatham
#stephenfleming
#blackcaps
#guptill
timsouthi


బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 81 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో రాస్ టేలర్‌‌కు ఇది 47వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (8,007) పరుగుల రికార్డుని రాస్ టేలర్ (8,026) అధిగమించాడు.

34 ఏళ్ల రాస్ టేలర్ 2006లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు న్యూజిలాండ్ తరుపున 203 ఇన్నింగ్స్‌లాడిన రాస్ టేలర్ 48.34 యావరేజితో 8,026 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 88 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో రాస్ టేలర్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా టామ్ లాథమ్(59), హెన్రీ నికోల్స్(64) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 47.2 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌటైంది.దీంతో మూడు వన్డేల సిరిస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీసిన టిమ్ సౌథీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా... న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్‌కి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది.
Recommended