'Train 18': Trial For Engineless,Semi-High Speed Train From Next Month
  • 6 years ago
The Indian Railways will start trials for indigenously-built and much-awaited semi-high speed 'Train 18' from next month, a senior official of the ministry said, three months after its scheduled unveiling.Once successfully tested, it shall be inducted in the railways fleet.The Research Design and Standards Organisation (RDSO), which is a technical adviser to the Indian Railways, will conduct testing and give its validation to the train.
#highspeedtrain
#indianrailways
#makeinindia
#NewTrains
#India


స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడు రైలు "ట్రైన్ 18"ను భారతీయ రైల్వే సంస్థ వచ్చే నెల ట్రయల్ రన్ నిర్వహించనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇక రెగ్యులర్‌గా ఈ రైలును నడుపుతామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇండియన్ రైల్వేస్‌కు సాంకేతిక సలహాలు ఇస్తున్న సంస్థ ది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ ట్రయల్ రన్ నిర్వహించి దీనిపై ఒక నివేదికను భారతీయ రైల్వేలకు అందజేస్తుంది. సాధారణంగా అన్ని బోగీలను ఇంజిన్ తీసుకెళుతుంది. కానీ ట్రైన్ 18 మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. దీనికి ఇంజిన్ ఉండదు. అన్ని బోగీలకు సెల్ఫ్ ప్రొపెల్లర్ అమర్చారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు కూడా ఇదే పద్ధతి ద్వారా నడుస్తున్నాయి. జూన్‌లోనే ట్రైన్ 18 పట్టాలు ఎక్కాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలును రూపొందించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈరైలు పరిగెడుతుంది.
Recommended