MS Dhoni And Ishaan Khatter Enjoy A Game Of Football In The City
  • 6 years ago
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా మారాడు. ముంబై వేదికగా జరగనున్న ఆల్ స్టార్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ నటులతో పాటు ధోనీ కూడా సిద్ధమవుతున్నాడు. ఎప్పటి నుంచో టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్.. ధోనీ ఫుట్‌బాల్ ఆటకు అమితాసక్తి. చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన ధోనీ.. బాలీవుడ్ హీరోలతో ఆల్ స్టార్స్ చారిటీ సాకర్ మ్యాచ్ కోసం సమాయత్తమవుతున్నాడు.ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇషాన్ కట్టర్‌ ఆటకు ముగ్ధుడై.. దఢక్ హీరోకు కొన్ని విలువైన సలహాలిచ్చాడు. భారత క్రికెట్ దిగ్గజం ధోనీ బాలీవుడ్ హీరోకు సాకర్‌ టిప్స్ ఇవ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తరచుగా అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్‌లతో ఫుట్‌బాల్ ఆడుతూ.. కనిపించే ఇషాన్ కట్టర్ ధోనీతో కలిసి ప్రాక్టీసు శిబిరంలో పాల్గొన్నాడు.

MS Dhoni was snapped in the city today enjoying a game of football with Ishaan Khatter and other boys.The former Indian cricket skipper is a sports lover and along with cricket, he even enjoys playing football. Ishaan Khatter is often snapped with Ranbir Kapoor and Abhishek Bachchan at football practices and matches in the city. Today, the actor was clicked with his team playing the game against MS Dhoni.
#msdhoni
#ishaankhatter
#football
#mumbai
#JhanviKapoor
Recommended