India vs England 2nd ODI: Couple Get Engaged At Lord's Stadium
  • 6 years ago
Marriages are made in heaven but on Saturday it was time to change the location to the Lord’s cricket ground. As England took India in the second ODI, a young couple- Charan Gill and Pavan Bains, made it a memorable occasion for themselves as the boy decided to pop the question from the stands with the help of David ‘Bumble’ Lloyd.
#yuzvendrachahal
#england
#india
#teamindia

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండో సిరీస్ లోని రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవిచూసింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య శనివారం రాత్రి ఆసక్తికరంగా వన్డే మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా మణికట్టు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జోరూట్ సెంచరీవైపు దూసుకెళ్తుండగా.. ఆ జట్టు భారీ స్కోరుకి బాటలు వేసుకుంటోంది.ఈ తరుణంలో అనూహ్యంగా మైదానం నుంచి ఓ కెమెరా కన్ను స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని ఉన్న ఓ ప్రేమజంట వైపు వెళ్లింది. స్టేడియంలోని పెద్ద తెరలపై లైవ్‌లో తాము కనిపించడంతో వెంటనే లేచిన ప్రేమికుడు.. పక్కనే ఉన్న అమ్మాయికి రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. కాసేపు ఆశ్చర్యానికి గురైన ఆ యువతి.. ఎట్టకేలకి అతడి ప్రేమని అంగీకరించింది.
Recommended