India V/s England ODI : Kohli Supports MS Dhoni
  • 6 years ago
On a day when he crossed the 10,000-run milestone in ODIs, Mahendra Singh Dhoni was booed by the Indian supporters at the 'Home of Cricket' for his slow batting during the team's 86-run defeat against England in the second game of the three-match series.Dhoni was widely criticised for not showing initiative in his 59-ball 37 as India could only manage 236 in 50 overs after England posted 322 for seven. While England's Joe Root found it "surprising", India's Yuzvendra Chahal said that he was unaware about the booing incident. Before the start of the 46th over, the match was as good as over with 110 required off 30 balls.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య శనివారం లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమికి ధోనియే కారణమంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో ధోని 59 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా వెనువెంటనే టాపార్డర్ వికెట్లు చేజార్చుకుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని నెమ్మదిగా ఆడాడు. డెత్‌ ఓవర్లలో ఫ్లంకెట్‌ వేస్తున్న బంతులను బాదకుండా ధోని డిఫెండ్‌ మాత్రమే చేశాడు.
Recommended