Will Dhoni Ranks In That Place after Sachin And Dravid ?
  • 6 years ago
Team India's Ex Captain Ms Dhoni is Little far for a Honorable record. Till Know from India Sachin Tendulkar and Rahul Dravid Catched That Record. In all Match Formets Player Has to play 500+ Matches to get this Record.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డుకు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున ఈ రికార్డును సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే అందుకోగలిగారు. ఇప్పుడా రికార్డు అందుకోవడానికి.. ఎంఎస్ ధోనీ సిద్ధంగా ఉన్నాడు. అదేంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్‌లలో కలిపి 500లు, ఆపైన మ్యాచ్‌లు ఆడటం. ఇప్పటివరకూ ప్రస్తుతం ధోనీ 497 మ్యాచ్ లు ఆడగాఅందులో (వన్డేలు-318, టెస్టులు-90, టీ20లు-89) ఉన్నాయి. అయితే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లాండ్‌తో 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాడు. ధోనీ ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆడితే అంతర్జాతీయ క్రికెట్‌లో అతడు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 505కు చేరనుంది. ఐర్లాండ్‌తో బుధవారం, శుక్రవారం రెండు టీ20లు ఆడనున్నాడు. ఆ తర్వాత జులై 3న ఇంగ్లాండ్‌తో టీ20 ఆడనున్నాడు.
ఇక 3 మ్యాచ్‌లు ఆడితే ధోనీ 500 మ్యాచ్‌ల క్లబ్‌లో చేరతాడు. కానీ, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. గరిష్ఠంగా 664 మ్యాచ్ లు ఆడగా అందులో (టెస్టులు 200, వన్డేలు 463, టీ20-1 మ్యాచ్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ 509 మ్యాచ్ లు ఆడగా అందులో (టెస్టులు-164, వన్డేలు-344, టీ20-1) మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. త్వరలో ధోనీ భారత్‌ తరఫున 500 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.
Recommended