Mahendra Singh Dhoni works Hard For Upcoming Matches
  • 6 years ago
Indian captain Virat Kohli, along with former skipper Mahendra Singh Dhoni, on Friday (June 15) took the fitness test which would determine his availability for the gruelling tour of United Kingdom starting June 27. The neck injury sustained during the Indian Premier League (IPL) had thrown Kohli's build-up for the UK tour into haywire as he had to pull out of a planned stint with Surrey in the County Championship this month.

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ధోనీ గత రెండు రోజుల నుంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ అనంతరం భారత జట్టు ఆడబోతున్న మరో షార్ట్ ఫార్మాట్ ఐర్లాండ్ టీ20. అయితే బీసీసీఐ ఇందులో పాల్గొనేముందు యోయో ఫిట్‌నెస్ టెస్టు తప్పనిసరి చేసింది. ఇటీవలే భారత జట్టు ఆటగాళ్లంతా బెంగళూరు వేదికగా ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొన్నారు. అయితే కొందరికీ నిరాశ తప్పకపోయినా మిగిలిన వాళ్లు టెస్టు పాసై మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు.
ఈ నేపథ్యంలో.. గత శుక్రవారం ఇదే అకాడమీలో నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్‌ టెస్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ భువనేశ్వర్ కుమార్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ సురేశ్ రైనా, కేదార్ జాదవ్‌తో కలిసి హాజరైన ధోనీ ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్‌నెస్ టెస్టు తర్వాత మిగిలిన క్రికెటర్లు వెళ్లిపోగా.. ధోనీ మాత్రం అకాడమీలోనే ఉంటూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
Recommended