Mahanati Movie Success Meet

  • 6 years ago
Keerthy Suresh starrer Mahanati has earned a 'blockbuster' status at the box office. By the end of 12 days, Mahanati earned Rs 55 crore at the worldwide box office. The global distributors' share stands at Rs 30.30 crore.
#Mahanati
#KeerthySuresh

కీర్తి సురేష్ ప్రధానపాత్రలో సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'మహానటి' చిత్రం బాక్సాఫీసువద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూ 'బ్లాక్ బస్టర్' చిత్రాల జాబితాలో చేరిపోయింది. సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లందరికీ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్ కలిపి రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. స్టార్ హీరోలు లేకుండా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇంత భారీ మొత్తం వసూలు చేయడాన్ని ట్రేడ్ వర్గాల్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు టోటల్ రూ. 30 కోట్ల పైచిలుకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైంది.
మహానటి' మూవీ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మేజర్ షేర్ వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ. 30.40 కోట్ల షేర్ వసూలు చేయగా, ఒక్క నైజాం ఏరియాలోనే రూ. 15.40 కోట్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది.
మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటకలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రూ. 2.40 కోట్ల షేర్ వసూలవ్వగా రూ. 84 లక్షల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. కర్నాటకలో రూ. 3.70 కోట్లు రాబట్టగా ఇందులో రూ. 1.5 కోట్ల షేర్ రాబట్టింది.

Recommended