Naa Peru Surya Audience Review
  • 6 years ago
Director Vakkantam Vamsi's Telugu movie Naa Peru Surya, Naa Illu India (NSNI) starring Allu Arjun and Anu Emmanuel has received positive reviews and good ratings from the audience.
#NaaPeruSurya
#AlluArjun
#AnuEmmanuel

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఇండియా కంటే ముందు యూఎస్ఏలో భారీగా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక ఏపీలో తెల్లవారు ఝామున 5 గంటలకే పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. అన్ని చోట్ల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే చాలా మంది ఫస్టాప్ యావరేజ్ అంటున్నారు. సెకండాఫ్ చాలా బావుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
నా పేరు సూర్య సినమా అద్భుతంగా ఉంది. హై ఓల్టేజ్ అండ్ హైలీ ఎమోషనల్ డ్రామా. అల్లు అర్జున్, వక్కంతం వంశీ, లగడపాటి శ్రీధర్ గారు అండ్ టీమ్‌కు కంగ్రాట్స్... అంటూ ట్వీట్స్ వెళ్లువెత్తుతున్నాయి.
నా పేరు సూర్య ఫస్టాఫ్ ఆశించిన స్థాయిలో లేదు. యాక్షన్ సీన్లు లవ్ ట్రాక్ ఉంది. సెకండాఫ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. నీట్‌గా ఎక్సిక్యూట్ చేశారు. సాంగ్స్ డిసప్పాయింట్ చేశాయి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ఫస్టాఫ్ బిలో యావరేజ్, సెకండాప్ గుడ్. ఓవరాల్ యావరేజ్ మూవీ. ఒకసారి చూడదగ్గ మూవీ.
అయితే కొందరు సినిమా నచ్చలేదంటూ ట్వీట్స్ చేశారు. చిత్ర టీమ్ సిల్లీ అటెమ్ట్ అంటూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను వక్కంతం వంశీ సార్ కుమ్మి అవతలేశాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నారు సార్. ఏం రైటింగ్.. ఏం టేకింగ్... బన్నీ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ.
ఫెంటాస్టిక్ మూవీ ఇది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. సూపర్ గూస్ బంప్ సీన్లు. లవ్ ట్రాక్ గుడ్. కొన్ని డైలాగులు చాలా బావున్నాయి. విజువల్స్ సూపర్. డైరెక్షన్ బావుంది.
వక్కంతం వంశీ ఇంకా బెటర్ గా చేస్తే బావుండేది. బన్నీ బోస్ట్ పెర్పార్మెన్స్ ఇచ్చారు. సెకండాఫ్ లో చాలా సీన్లు లాగారు.