Why Gambhir is out of the Team
  • 6 years ago
Former Selection Committee Chairman Sandeep Patil Revealed the Reasons Behind for Not taking Gambhir into the Team India.
తన ప్రవర్తన తీరు సరిలేని కారణంగానే భారత జట్టులో గౌతమ్ గంభీర్ చోటు కోల్పోయాడని సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ సందీప్‌ పాటిల్‌ అన్నాడు. తాజాగా ముంబైలో ఓ స్థానిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సందీప్ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
'గంభీర్‌ను అప్పట్లో జట్టు నుంచి తప్పించాం. అందుకు ప్రధాన కారణం అతడి తీరు సరిగా లేకపోవడమే. ఆ సమస్య రోజురోజుకీ పెరుగుతూ పోయింది. అతడికి ఆవేశం చాలా ఎక్కువ' అని సందీప్ పాటిల్‌ తెలిపాడు. 2011లో ఇంగ్లాండ్‌ సిరీస్‌లో బౌన్సర్‌ తగలడం, ఆ తర్వాత స్వదేశానికి తిరిగి రావడం గంభీర్‌కు చాలా నష్టం కలిగించిందని అన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టు, మూడు రోజు క్యాచ్ అందుకునే ప్రయత్నంలో గంభీర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ పర్యటన నుంచి గంభీర్ అర్ధాంతరంగా భారత్‌కు తిరిగొచ్చాడు.
#Sandeep patil
#Gautam gambhir
#Team India
#IPL 2018
Recommended