IPL 2018: Gambhir Says Conditional boycott insufficient for improving Inter Country Relations

  • 6 years ago
"In the recent past, we have initiated talks withNeighbouring Country on many occasions, but no substantial outcome has been achieved. Every country has its own level of patience and importance. First thing, of course, is to talk; but if that doesn't work, one has to take strict action. There is no point in politicising the matter," said Gambhir.

టీమిండియా క్రికెటర్‌, ఢిల్లీ డేర్ డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాకిస్థానీయులపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో వాళ్లను భారత్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సాయంత్రం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఒక్క క్రికెట్‌లోనే కాదు.. సినిమాలు, సంగీతం.. అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌ను నిషేధించాలి. సరిహద్దులో వాళ్లు మన సైనికులను చంపుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? శాంతి చర్చలు ప్రభుత్వం చేయాల్సిన పని. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చే వరకు వారిని మనదేశంలోకి అడుగుపెట్టనీయకపోవటమే ఉత్తమం' అని గంభీర్‌ అభిప్రాయపడ్డారు.
గతేడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సైనికుల పిల్లల చదువుకయ్యే ఖర్చును భరించిన గంభీర్..తాజాగా గురువారం రాత్రి వారితో కలిసి డిన్నర్‌ చేసి సందడి చేశాడు.
ఇక సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలపై గంభీర్‌ స్పందించారు. ‘గతంలో పాక్‌ను చర్చల కోసం అనేకసార్లు భారత్‌ ఆహ్వానించింది. కానీ, ఏం సాధించాం?. ఒక పక్క చర్చలంటూనే.. మరో పక్క మన సైనికులను పాక్‌ పొట్టనపెట్టుకుంటోంది. ప్రతిగా పాక్‌ రేంజర్లను మన సైన్యం చంపటంలో ఎలాంటి తప్పు లేదు. సహనం అనేది కొంత వరకే ఉండాలి. ముందు శాంతి బాటలో చర్చలు జరపాలి. కుదరకపోతే కఠిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో రాజకీయాలకు తావు ఇవ్వకూడదు' అని గంభీర్‌ పేర్కొన్నారు.
#IPL 2018
#Gambhir

Recommended