IPL 2018: Mayank Markande Grabs Purple Cap

  • 6 years ago
On Thursday he again proved his mettle as he picked up 4 wickets for 23 in his four overs. His wickets - Wrddhiman Saha, Shikhar Dhawan, Manish Pandey and Shakib Al Hasan. With seven wickets so far, he has already grabbed the purple cap.

ముంబై బౌలర్ మయాంక్ మార్కండే మరోసారి మ్యాజిక్ చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గుగ్లీలతో వికెట్లు తీస్తూ.. ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ విభాగానికి వెన్నెముకలా మారాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడటం ఇదే తొలిసారి.
అయినా ఈ మ్యాచ్‌ మొత్తంలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన మార్కండే.. సన్‌రైజర్స్‌పై 23 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో సాహాను ఔట్ చేసిన మయాంక్.. తర్వాత శిఖర్ ధావన్ 28 బంతుల్లో (45)ను అవుట్ చేశాడు. క్రీజులో కుదురుకుంటున్న మయాంక్ అగర్వాల్‌(11) 8 బంతుల్లో ఔట్ చేసిన ఈ యువ స్పిన్నర్.. తన ఆఖరి ఓవర్ చివరి బంతికి షకీబుల్ హసన్‌ను పెవిలియన్ చేర్చాడు.
దీంతో హైదరాబాద్ ఓ దశలో ఓటమి అంచున నిలిచింది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఒకే ఓవర్లో రాయుడు, ధోనీలను పెవిలియన్ చేర్చిన మయాంక్.. ముంబైను దాదాపు గెలిపించినంత పని చేశాడు. కానీ ఆఖర్లో బ్రావో అద్భుత హిట్టింగ్‌తో చెన్నైకు విజయాన్నిఅందించాడు. మయాంక్ అద్భుత ప్రదర్శనకు ముగ్ధుడైన రోహిత్.. చెన్నైతో మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. అతడే మా అస్త్రం అంటూ ఈ యువ స్పిన్నర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Recommended