Big News Big Bite బిగ్ న్యూస్ బిగ్ బైట్ 08/02/2018

  • 6 years ago
TDP MPs Hold Black Ribbon Protest in Parliament Against Union Budget 2018. In the Parliament of India, Prime Minister Narendra Modi took a dig at Congress member Renuka Chowdhury in the Rajya Sabha over her laughter, after Vice President Venkaiah Naidu admonished her for it. now Modi and Venkaiah slammed for ‘joke’ on Renuka Chowdhury’s laughter in Rajya Sabha

మోడీ ప్రసంగంలో ఏమీ లేదని భావిస్తున్న చంద్రబాబు బీజేపీకి మరో షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలో అన్ని పార్టీలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించడం గమనార్హం. పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతును కూడగట్టాలని కూడా ఎంపీలకు దిశానిర్దేశనం చేశారు. అంతేకాదు, అందరికీ అర్థమయ్యేలా ఏపీకి జరిగిన అన్యాయంపై బుక్ లెట్స్ పంచాలని చెప్పారు.మనం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు అన్నారు. ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీలు అందరూ బలంగా మన వాయిస్ వినిపించాలని చెప్పారు. మన పోరాటాన్ని జాతీయస్థాయికి తీసుకు వెళ్లాలని చెప్పారు.ఒక సభలో ప్రకటన చేస్తే సరిపోదని, రెండు సభల్లో చేయాలన్నారు. చిదంబరం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ.. మీ వల్లే ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని, ఇప్పటికైనా పాపం కడుక్కోమని తాను చిదంబరానికి చెప్పానని చంద్రబాబుకు చెప్పారు. తనకు సభలోకి వెళ్లే అవకాశం లేదని సీఎం రమేష్ చెప్పడంతో.. గాంధీ విగ్రహం వద్ద లేదా సెంట్రల్ హాలులో కూర్చొని నిరసన తెలపాలని సూచించారు.ఏపీ ప్రజలను పూల్స్ కారని, ప్రతీసారీ ఏపీ ప్రజలను మోసం చేయలేరని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే రకంగా నిధుల కేటాయింపు కొనసాగితే మిత్రులుగా కొనసాగడం కష్టమని గల్లా జయదేవ్ ప్రకటించారు.ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్ బంద్‌లో దాదాపు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. బిజెపి మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళనలో పాలు పంచుకున్నారు.

Recommended