Big News Big Bite బిగ్ న్యూస్ బిగ్ బైట్

  • 6 years ago
Telugudesam Party MPs met BJP senior leader LK Advani on Friday over Poll promises to Andhra Pradesh. YSR Congress Rajya Sabha MP V Vijaya Sai Reddy called on President Ram Nath Kovind in New Delhi on Thursday and complained that the TDP was acting against the spirit of the Constitution in the Upper House

బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత టీడీపీ ఎంపీలు బీజేపీ మిత్రపక్షం అయినప్పటికీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవాల్సిందే అంటున్నారు. వారికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే విషయం చెబుతున్నారు. విభజన హామీలు నెరవేరలేదని, బడ్జెట్‌లో అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు లోబల బయట తీవ్రమైన నిరసనలు చేపట్టాలని పదేపదే సూచించారు.
ప్రస్తుతం చంద్రబాబు దుబాయ్‌లో ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చడం లేదు.. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదు.. వీటికి తోడు పార్లమెంటులో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల ప్రకటనలు టీడీపీకి, చంద్రబాబుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అందుకే వారు ప్రకటన చేసినా టీడీపీ ఎంపీలు బెట్టు వీడలేదు. శుక్రవారం కూడా బాబు ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని ఎంపీలకు హింట్ ఇచ్చారని తెలుస్తోంది. ఓవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరు.. అదే సమయంలో ఇరు పార్టీల సమరం.. వెరసి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వేర్వేరుగా తమ నిరసనల్ని తెలియజేస్తూ వస్తున్న టీడీపీ, వైసీపీలు.. సంధు దొరికితే చాలు ప్రత్యర్థి పార్టీని విమర్శించేందుకో.. ఇరుకున పెట్టేందుకో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడా ఛాన్స్ వైసీపీకి దొరికింది. టీడీపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యవహారాన్ని చర్చకు పెట్టడంలో సఫలమయ్యారు. అంతేనా.. నైతికంగా ఇది వెంకయ్య, మోడీలను ఇబ్బందిపెట్టే విధంగా విజయసాయిరెడ్డి ముందుకు వెళ్తున్నారు.కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీని, ఇటు బీజేపీని ఇరుకునపెట్టేవిగా మారాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సలహాలివ్వడంలో తప్పేమి లేదంటూ దాటవేత ధోరణిని ప్రదర్శించినా.. నైతికంగా ఇది చెల్లుబాటు కాదని విజయసాయిరెడ్డి పరోక్షంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రపతిని కలిసి విషయం మొత్తం ఆయన ముందు పెట్టారు

Recommended