IND v SA 3rd ODI : SA aim to exploit IND weakness
  • 6 years ago
The visitors won the first two matches of the series in Durban and Centurion by six and nine wickets, respectively, dismantling the home side with consummate ease.

సఫారీ జట్టు పై వరుసగా రెండు వన్డేలలో ఘన విజయం నమోదు చేసిన టీమిండియా మూడో వన్డేలోనూ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది. దక్షిణాఫ్రికా మాజీ కోచ్ జెన్నింగ్స్ లాంటి వాళ్లు సైతం సఫారీ జట్టు ఇక సిరీస్ కోల్పోయినట్లే అని విశ్లేషిస్తున్నారు. అయినా మేము ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదు. భారత జట్టు బలహీనతపై దెబ్బ కొడతాం. ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని ఆ దేశ జట్టు ఫాస్ట్ బౌలర్ రబడ వ్యాఖ్యానించాడు.
మూడో వన్డే నేపథ్యంలో రబడ మీడియాతో మాట్లాడాడు. 'టీమిండియా ఆటగాళ్ల విషయంలో ఒక్కో బ్యాట్స్‌మెన్ కు ఓ బలహీనత ఉంటుంది. వారి వీక్‌నెస్ పై దెబ్బకొట్టి ప్రయోజనం పొందుతాం. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విషయానికొస్తే షార్ట్ పిచ్ బంతులు మా ప్లాన్. భారత్ మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లపై నమ్మకం ఉంచింది. మా జట్టు సైతం ఐదుగురు మణికట్టు స్పిన్నర్లతో మూడో వన్డేకు ముందు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించింది.' అంటూ గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
'ఏది ఏమైనా భారత్ బలమైన జట్టు, ఇటీవల ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ నెగ్గారని గుర్తు చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్‌లు దూరం కావడం మాకు మైనస్ పాయింట్ అన్నాడు. స్పిన్నర్లు ప్రభావం చూపిస్తే మూడో వన్డే నెగ్గి సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంటామని' నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
డివిలియర్స్, డు ప్లెసిస్, క్వింటన్ డికాక్‌ లాంటి స్టార్ క్రికెటర్లు ఈ వన్డేలకు అందుబాటులో లేరు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. అయితే సిరీస్‌పై తమ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని సఫరీ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ అంటున్నాడు. ప్రత్యర్థి తప్పిదాలు చేస్తే ఈ వన్డేలో తమదే విజయమని, కీలక ఆటగాళ్లు లేకున్నా పోరాటం మాత్రం కొనసాగిస్తామని చెప్పాడు. కేప్‌టౌన్‌లో నేడు (బుధవారం) దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.
Recommended