Ind Vs SA 6th ODI : Dhoni, Kuldeep On The Brink Of History | Oneindia Telugu
  • 6 years ago
India will take on South Africa in the 6th ODI in Super Sport Park on Friday. MS Dhoni and Kuldeep Yadav can look forward to brink of history.

ఆరు వన్డేల సిరిస్‌ను మరో వన్డే మిగిలుండగానే కోహ్లీసేన 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌‌లో చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16)న సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు.
ఈ సిరిస్‌లో ఇప్పటివరకు భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీసిన వికెట్లు 16. మరో మూడు వికెట్లు తీస్తే ఓ ద్వైపాక్షిక వన్డే సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. టీమిండియా మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, అమిత్ మిశ్రాలు 18 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు ధోని వన్డే పరుగులు 9,898. పదివేల పరుగుల మైలురాయిని ధోని సునాయాసంగా చేరుకుంటాడని అంతా భావించారు. ఐదు వన్డేలు ముగిసినా పది వేల పరుగుల మైలురాయిని అందుకోలేకపోయాడు. నాలుగో వన్డేలో 42 పరుగులు మినహా ధోని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ ధోని 69 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా పదివేల పరుగుల మార్కుకు 33 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ప్రస్తుతానికి ధోని వన్డేల్లో 9,967 పరుగులతో ఉన్నాడు.
ధోని పదివేల పరుగుల మైలురాయిని అందుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 14,234 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోని పదివేల మార్కును చేరితే ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
Recommended