ఘనతంతా చంద్రబాబుదే : కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

  • 6 years ago
Telangana IT Minister KTR has lauded TDP President N Chandrababu Naidu as the crusader of IT industry in Hyderabad.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా.. హైటెక్ సిటీ, సైబరాబాద్ లేకుండా ఆయన ప్రసంగం ముగిసిపోదు. తానే ఐటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చానని ఎన్నోసార్లు ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఆయనపై విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలకు అమితమైన ప్రాధాన్యత లభించింది.
ఇంతకీ అసలు విషమేంటంటే.. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు.
ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్‌ అంతా చంద్రబాబుకే దక్కుతుంది' అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. గురువారం హైటెక్స్‌ సిటీలో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్‌ మూర్తి, నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ డేబ్జానీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Recommended