YSRCP Rajyasabha MP Unanimous : ఆంధ్రప్రదేశ్ కోటాలో వైసీపీ ఎంపీల ఎన్నిక పూర్తి | ABP Desam

  • 2 years ago
ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన నలుగు సభ్యులు వి. విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్. కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటిస్తూ వారికి దృవీకరణ పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు  సభ్యులు మాత్ర‌మే నామినేషన్లను దాఖలు చేశారు.దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

Recommended