మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం.. కాన్వాయ్‌పై ఎలా దాడి చేశారంటే?

  • 2 years ago
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై ఆదివారం రాత్రి దాడి జరిగింది. పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి ఆయనను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ శివారులో ఆదివారం సాయంత్రం రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి ప్రసంగాన్ని కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పొగడటాన్ని తప్పుపట్టారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటేమైందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పరిస్థితిని గమనించిన మంత్రి వేదిక దిగి వెళ్లిపోతుండగా, వెంబడించి.. ఆయన కాన్వాయ్‌పై కుర్చీలు, చెప్పులు విసిరారు.

Recommended