అందరినీ పలకరిస్తూ.. అన్నీ ఆరా తీస్తూ.. పోచంపల్లిలో షర్మిల పాదయాత్ర

  • 2 years ago
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని వంకమామిడి గ్రామం నుంచి వైఎస్ షర్మిల ప్రజా సంగ్రామ పాదయాత్ర గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. శివారెడ్డి గూడెం, జిబ్లక్ పల్లి, దంతూర్ గ్రామాల మీదుగా రైతులను, నిరుద్యోగులను, పలకరిస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు వైఎస్ షర్మిల.. వంకమామిడి గ్రామంలో వృద్ధులను పలకరించి పింఛన్ వస్తుందా లేదా అని వివరాలను తెలుసుకున్నారు. రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారా లేదా ఎరువులు సమయానికి వస్తున్నాయా అడిగి కనుక్కున్నారు. సాయంత్రం 6 గంటలకు పోచంపల్లి మండల కేంద్రానికి పాదయాత్ర చేరుకుంటుంది. పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత సదస్సులో చేనేత సమస్యలపై వైఎస్ షర్మిల మాట్లాడనున్నారు..

Recommended