అదే జరిగితే జగన్‌ను అరెస్ట్ చేస్తారు: మాజీ మంత్రి

  • 2 years ago
ఏపీలో మూడు రోజులుగా రాజధాని వ్యవహారం హీట్ పెంచింది. మంత్రి బొత్స హైదరాబాద్‌ ప్రస్తావన తీసుకురావడం.. మరో రెండేళ్లు అవకాశం ఉందనడం చర్చనీయాంశమైంది. తాజాగా ఏపీకి హైదరాబాద్ రాజధాని అన్న మంత్రి బొత్స వ్యాఖ్యలకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాదే రాజధానంటూ బొత్స మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.. రాజధాని విషయంలో మంత్రి గందరగోళానికి గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు.‘హైదరాబాద్‌ వెళ్లండి.. మీరన్నట్టు హైదరాబాద్ రాజధానిలో సీఎం ఉంటే.. మర్నాడే సీబీఐ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంది.. రిమాండ్‌కు పంపిస్తారు. మూడు రాజధానులని చెబుతూ మళ్లీ హైదరాబాద్‌ రాజధాని అనడం ఏమిటో?, ఇలాంటి తుగ్లక్‌ మాటలొద్దు. గత నవంబరుకే పోలవరం నుంచి నీళ్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి గడుస్తున్నా నీళ్ల జాడ ఏద’ని అయ్యన్నపాత్రుడు సెటైర్లు పేల్చారు.

Recommended