వైసీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు

  • 2 years ago
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైఎస్సార్‌సీపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పై నియోజకవర్గ పరిధిలోని కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు తిరుగుబాటు ప్రకటించారు. లావేరులో సమావేశమైన ఆ పార్టీ నేతలు.. ఎమ్మెల్యే పనితీరుపై భగ్గుమన్నారు. పార్టీలో ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు మళ్లీ టికెట్ ఇస్తే సహించేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు.ఒకవేళ అధిష్టానం కిరణ్ కుమార్‌కు టికెట్‌ ఇస్తే పార్టీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్‌ నాయకత్వం కోసమే తాము పనిచేస్తామని.. ఎమ్మెల్యేపై అధిష్ఠానానికి ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు. కిరణ్‌కుమార్‌కు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని.. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఎంపీపీలుగా ఎన్నికైన నేతల పనితీరు కూడా అధ్వానంగా ఉందని ఆరోపించారు.

Recommended