IPL 2021 : David Warner Not Allowed To SRH Dugout, Fans Unimpressed || Oneindia Telugu

  • 3 years ago
IPL 2021, SRH vs KKR : David Warner not permitted to sit in SRH dugout enjoys match along with audience.
#IPL2021
#DavidWarner
#SRH
#SunrisersHyderabad
#KaneWilliamson
#BhuvneshwarKumar
#JonnyBairstow
#JasonRoy
#WriddhimanSaha
#Cricket

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఘోర అవమానం జరిగింది. పేలవ బ్యాటింగ్‌తో కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ భాయ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యాడు. అయితే మాజీ కెప్టెన్ అయిన డేవిడ్ భాయ్‌కు డగౌట్‌కు అనుమతి లభించలేదు. దాంతో అతను ప్రేక్షకుల గ్యాలరీకి పరిమితమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానిగా జట్టుకు మద్దతు తెలిపాడు. కానీ టీమ్ మరోసారి పేలవ ప్రదర్శనతో ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. వార్నర్ ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వార్నర్‌ను అలా చూసిన అతని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Category

🥇
Sports

Recommended