Ross Taylor clarity on his retirement from international cricket | Oneindia Telugu
  • 3 years ago
Ross Taylor clarity on his retirement from international cricket.
#RossTaylor
#WorldTestChampionship
#Newzealand
#BlackCaps
#Kiwis
#KaneWilliamson

తన రిటైర్మెంట్​పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్‌మన్‌ రాస్ టేలర్. ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అనంతరం టేలర్ క్రికెట్​కు వీడ్కోలు చెప్తాడని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అలాంటిదేమి లేదని, తాను ఆడాలనుకున్నంత వరకు క్రికెట్​లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనే లేదని టేలర్ చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్‌.. తొలిసారి ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
Recommended