Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka
  • 3 years ago
Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka
#Indvssl
#Teamindia
#ShikharDhawan
#RahulDravid

శ్రీలంక పర్యటనలో సిరీస్‌లు నెగ్గడమే తమ ప్రధాన లక్ష్యమని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్, టీమిండియా బీ టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. భారత్-ఎ, అండర్-19 కోచ్‌గా ఎంతో సక్సెస్‌ సాధించి, ఎంతో మంది యువ ఆటగాళ్ల‌ను తీర్చిదిద్దిన రాహుల్‌ ద్రవిడ్‌ తొలిసారి నేషనల్‌ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టూర్​ విషయంలో తన ఆలోచన చాలా క్లియర్​గా ఉందని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. ఈ పర్యటన​కు బయల్దేరే ముందు ఆదివారం జరిగిన వర్చువల్‌‌ మీడియా కాన్ఫరెన్స్‌‌లో కెప్టెన్ శిఖర్ ధావన్‌తో కలిసి కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడాడు. టూర్​లో తమ ప్రధాన టార్గెట్‌ సిరీస్‌లు నెగ్గడమే అని చెప్పాడు. టీ20 వరల్డ్‌ కప్‌నకు ముందు భారత్‌కు కేవలం 3 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉండడం కాస్త నిరుత్సాహ పరిచే అంశం అన్నాడు.
Recommended