Telangana Budget 2020: Rs 14,000 Crore for Rythu Bandhu
  • 4 years ago
Telangana Budget 2020: Finance Minister T. Harish Rao presented a budget of Rs. Rs.1,82,914 Crore for Telangana State for the financial year 2020-21, an increase by a whopping Rs. 40,762 crore compared to revised budget of 2019-20.Agriculture and farmers’ welfare is being given importance, The Budget has allocated Rs 14,000 crore for the `Rythu Bandhu’ programme, which gives the farmer Rs 10,000 per acre for input costs.

#TelanganaBudget2020
#TelanganaBudgetHighlights
#TelanganaAssembly
#RythuBandhu
#HarishRao
#trs
#farmers
#Budget2020
#AgricultureSector
#BudgetAllocations
#loanwaiver
పంట పెట్టుబడి సాయంతో రైతులుకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. 2020-2021 బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకే గాక కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కిసాన్ సన్మాన్ నిధిని కూడా ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8 వేలు అందజేశామని హరీశ్ రావు వివరించారు. కానీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట పెట్టుబడి సాయం రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచామన్నారు. 2018-2019 వానాకాలంలో 5,235 కోట్లు, యాసంగిలో 5,244 కోట్లు వ్యయం చేశామని మంత్రి హరీశ్ రావు వివరించారు. 2019-20లో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడంతో కేటాయింపులు కూడా పెరిగాయని వివరించారు. రూ.12 వేల కోట్లు కేటాయించి.. రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. కొత్తగా పాస్ పుస్తకాలు మంజూరు చేయడం వల్ల రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య వచ్చే ఏడాది మరింత పెరుగుతోందన్నారు. లబ్ధిదారుల సంఖ్య పెరగడంతో బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు పెంచామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Recommended