Rahul Sipligunj Challenges TRS MLA & Tollywood Stars
  • 4 years ago
Rahul Sipligunj Challenges TRS MLA Dasyam Vinay Bhaskar And Tollywood hero Vishwaksen & Director Tharun Bhascker Fo Green Challenge.
#GreenChallenge
#Anchorsuma
#RahulSipligunj
#TRS
#DasyamVinayBhaskar
#TharunBhascker
#Vishwaksen
#Gogreen
#biggbosstelugu3

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల విసిరిన సవాల్‌ను బిగ్‌బాస్ తెలుగు 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించారు. అందులో భాగంగా ఆయన మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. వారిలో ఫలక్‌నుమా దాస్ హీరో విశ్వేక్సేన్ నాయుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్, వరంగల్ వెస్ట్ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్‌లున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ... తన జీవితంలో మొదటి సారి ప్రకృతిని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన యాంకర్ సుమకు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపి సంతోష్‌కుమార్‌ను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రీన్ ఛాలెంజ్‌‌లో భాగంగా మూడు మొక్కలు నాటిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ, రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
Recommended