Bigg Boss Telugu 3: Episode 31 Highlights | నన్ను అలా అంటే ఒక్కొక్కడిది పగులగొడుతా..మహేష్ వార్నింగ్!
  • 5 years ago
Bigg boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
#BiggBossTelugu3
#AkkineniNagarjuna
#rahulsipligunj
#sivajyothi
#Sreemukhi
#RaviKrishna
#rohininoni
#VarunSandesh
#BabaBhaskar

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 29, 30వ రోజు ఆసక్తి కరం గా సాగాయి. కాసేపు కోపతాపాలతో, మరికొంత సేపు వినోదంతో ఇల్లు కళకళలాడింది. ఇంటిలో చాలా రకాల భావోద్వేగాలు వేదికపై కనిపించాయి. అంతేకాకుండా కెప్టెన్సీ టాస్క్‌లో వితిక, శివజ్యోతి పోటీ పడ్డారు. అలాగే వరుణ్ సందేశ్, వితిక పెళ్లి రోజును ఇంటి సభ్యులు ఘనంగా నిర్వహించారు. వారిని ఆశీర్వదించి దీవించారు. ఇంటిలో 30వ రోజు హైలెట్స్ చూస్తే.. ప్రస్తుత వారంలో ఏ కారణం లేకుండా తనను కెప్టెన్ అలీ నామినేట్ చేయడంపై కంటతడి పెట్టిన బాబా భాస్కర్ ఆ బాధ నుంచి తేరుకొని వంటగదిలోకి వెళ్లాడు. నూనె విపరీతంగా వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలా వాడితే నూనె సరిపోదు. ఇంకా రెండు బాటిల్స్ మాత్రమే ఉన్నాయి అని బాబా భాస్కర్ ఇంటి సభ్యులకు హెచ్చరించారు. మటన్ వండే పనిలో ఇంటి సభ్యులు ఉన్నారు.ఇక బాబా భాస్కర్ కంటతడి పెట్టడం ఇంటి సభ్యుల మధ్య భారీ చర్చకు దారి తీసింది. తాను ఎందుకు బాబాను నామినేట్ చేశాననే విషయంపై వివరణ ఇవ్వడానికి కెప్టెన్ అలీ సిద్ధమయ్యాడు. బాబా భాస్కర్ బాధపడిన విషయాన్ని శ్రీముఖి ఇంటి సభ్యులతో ముచ్చటించింది. బాబాతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అలికి సూచించింది.
Recommended