Anchore Suma Father-In-Law Devadas Kanakala Is No More || Filmibeat Telugu
  • 5 years ago
Devadas Kanakala is no more. Devadas Kanakala is an Indian actor. He is from Andhra Pradesh who predominantly appeared in Telugu language films. Super Star Rajini Kanth, Chiranjeevi and Rajendra Prasad are the students of Devadas.
#DevadasKanakala
#Anchorsuma
#rajivkanakala
#RajiniKanth
#Chiranjeevi
#RajendraPrasad
#tollywood

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.
1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం‌లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి కొన్ని రోజులకే దాన్ని వదిలేశారు.
Recommended