జగన్ వల్లే ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వలేదన్న చంద్రబాబు || Oneindia Telugu

  • 5 years ago
Chandrababu was furious over allegations by the YCP leaders that the World Bank had failed to provide loans. Is the YCP the reason for the World Bank to back down? He asked. Chandrababu said that the World Bank has complained about the intentional farmers. Not just Amaravathi, he said that no project in the state will be funded anymore.He criticized the YCP government for not needing state development. There are pulivendula like clashes throughout the state. He added that anarchy is on the rise in the state.
#andhrapradesh
#worldbank
#decision
#InspectionPanel
#Amaravathi
#jagan
#vijayawada
#chandrababu

ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణంగా నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ఏపీ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 2100 కోట్ల రూపాయల రుణం ఇవ్వలేమని ప్రపంచ బ్యాంకు తన వెబ్ సైట్ లో ప్రకటించింది . అయితే వైసీపీ వల్లే ఇది జరిగిందని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తుంది. చంద్రబాబు వల్లే ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వకుండా వెనక్కు పోయిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి వైసీపీ కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కావాలని రైతుల చేత ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క అమరావతికే కాదు, ఇక నుండి రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు ఇకపై నిధులు రావని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. రాష్ట్రమంతా పులివెందుల తరహా గొడవలు కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచకం పెరిగిపోతుందని ఆయన పేర్కొన్నారు.

Recommended