ICC World Cup 2019 Final:England Win 2019 World Cup After Super Over Drama || Oneindia Telugu

  • 5 years ago
London - Ben Stokes is England's hero, guiding them to a Super Over victory over New Zealand to win the 2019 Cricket World Cup final at Lord's on Sunday. Not even the Super Over could separate the sides - they both scored 15 - but England are crowned champions by virtue of hitting more boundaries in their innings of 242 compared to New Zealand.It was, easily, the greatest World Cup final of all time and it is England's first time coming out on top in four final attempts.
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#SuperOver

క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లాండ్ ఇంతకాలం వరల్డ్ కప్ గెలుచుకోలేకపోవడం అనేది ఒక వెలితి అనే చెప్పవచ్చు. 1975 నుంచి మొదలు 2015 వరల్డ్ కప్ వరకూ 3 సార్లు టోర్నీ ఫైనల్ కు చేరుకొని విశ్వవిజేత అయ్యే అవకాశం జారవిడుచుకున్నప్పటికీ, 2019లో మాత్రం స్వదేశంలో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో ఇంగ్లీష్ సేన ప్రపంచ కప్ ను అందుకుంది. టోర్నీ ఆసాంతం అద్వితీయమైన ప్రదర్శనతో అదరగొట్టిన మోర్గాన్ సేన ఫైనల్ లో కివీస్ జట్టును మట్టికరిపించి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదనలో ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌటవ్వడంతో నాటకీయ పరిణామాల మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ లో తొలి ఛాన్స్ ఇంగ్లాండ్ కు దక్కగా ఆ ఓవర్లో మొత్తం 15 పరుగులు రాబట్టింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కూడా 15 పరుగులే చేసింది. అయితే బౌండరీల ప్రాతిపదికన చూస్తే ఇంగ్లాండ్ సూపర్ ఓవర్ లో రెండు బౌండరీలు బాదగా, న్యూజిలాండ్ మాత్రం సూపర్ ఓవర్ లో బౌండరీలు బాదలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్ విశ్వవిజేత అయ్యింది.

Recommended