ICC World Cup 2019 Final:What Is The Main Strengths Of New Zealand And England || Oneindia Telugu

  • 5 years ago
-New Zealand captain Kane Williamson won the toss and decided to bat against England in the World Cup final at an overcast Lord's on Sunday.Both the sides were unchanged. He believes the pitch will suit batting despite the overhead conditions. Morgan is quite happy to bowl first.
#icccricketworldcup2019
#engvnz
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
#cricket
#teamindia
#cricket
#teamindia

ఈసారి వన్డే వరల్డ్‌కప్‌లో కొత్త చాంపియన్‌ అవతరించబోతోంది. ఒకటి అందరూ టైటిల్‌ ఫేవరెట్‌గా పేర్కొన్న జట్టు ఇంగ్లండ్‌ కాగా టోర్నీ మధ్యలో కొంత తడబాటుకు గురైనా.. ఆ తర్వాత అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్‌. ఈ రెండు జట్లు మెగా టైటిల్‌ పోరులో తలపడుతున్నాయి. క్రికెట్‌కు పుట్టినిల్లయినా.. ఒకటికి మూడు సార్లు ఫైనల్‌ చేరినా.. ఇప్పటిదాకా ప్రపంచకప్‌ కల తీరని జట్టు ఇంగ్లండ్‌ది. ఇంకొకటి పెద్దగా అంచనాల్లే కుండా బరిలోకి దిగి.. లీగ్‌ దశలో డక్కామొక్కీలు తిని.. కష్టం మీద నాకౌట్‌కు చేరి.. సెమీస్‌లో బలమైన భారత జట్టుకు షాకిచ్చి ఫైనల్లో అడుగుపెట్టిన కివీస్‌. ప్రపంచ కప్‌లో ఎప్పుడూ మెరుగైన ప్రదర్శనే చేసే ఆ జట్టుకు.. టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షే. ఒకసారి ఫైనల్‌ ఆడింది. కానీ కప్పు అందలేదు. మరికొద్ది గంటల్లో ఇరు జట్ల దశాబ్దాల నిరీక్షణకు ఆదివారం తెరపడబోతోంది. లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న తుది సమరంలో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి.

Recommended