ICC World Cup 2019: Virat Kohli Speaks About Form Of Rohit Sharma And Shikhar Dhawan!!
  • 5 years ago
Video Link: https://telugu.mykhel.com/cricket/icc-world-cup-2019-virat-kohli-speaks-about-form-of-rohit-sharma-shikhar-020862.html

ICC World Cup 2019:“We have had two good challenges in the two games while batting first. Shikhar and Rohit are quality players, they become stars in ICC events. Ideally, we would have liked to chase today. I understand if guys don’t get going right away in this format. In warm-up games, at times, you don’t get the motivation especially because of the amount of cricket that we play. But I am glad with what we got out of these two games,” Kohli said
#iccworldcup2019
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#msdhoni
#klrahul
#cricket
#teamindia


వరల్డ్‌కప్‌కు ముందు జరిగిన సన్నాహాక మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఫామ్‌పై ఎటువంటి ఆందోళన లేదని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో నిరాశ పరిచిన ఓపెనర్లు... కార్ఢిప్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ రాణించలేదు.
ధావన్ కేవలం 1 పరుగుకే పెవిలియన్‌కు చేరగా... మరో ఓపెనర్ రోహిత్ శర్మ 42 బంతులాడి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ పేలవ ప్రదర్శన చేసిన ఓపెనర్లను కెప్టెన్ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. బంగ్లాతో మ్యాచ్ అనంతరం కోహ్లీ ఓపెనర్ల ప్రదర్శన తనను నిరాశపరచలేదని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో ఆడిన విధానం టీమిండియాకు అత్యంత శుభపరిణామం. అందరికీ జట్టులో వారివారి పాత్రలేంటో తెలుసు. కేఎల్ రాహుల్ పరుగులు చేయడం చాలా కీలకం. ధోనీ, హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా ఆడారు. రెండు వార్మప్ తొలుత బ్యాటింగ్ చేయడం నిజంగా సవాలే" అని అన్నాడు.
"శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మంచి ఆటగాళ్లు. ఐసీసీ ఈవెంట్లలో వాళ్లు స్టార్ ఆటగాళ్లు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఛేదన చేయాలనుకున్నాం. వన్డే ఫార్మాట్‌లో కుదురుకోవడానికి వెంటనే వీలుపడదు. రెండో వార్మప్ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నుంచి మాకు సవాళ్లు ఎదురయ్యాయి. మేం చక్కగా బౌలింగ్‌ చేశాం. స్పిన్నర్లు వికెట్లు తీశారు. బుమ్రా కీలకంగా నిలిచాడు" అని కోహ్లీ చెప్పాడు.
Recommended