IPL 2019: Kings XI Punjab Defeat's Sunrisers Hyderabad By 6 Wickets | Match Highlights
  • 5 years ago
IPL 2019: Kings XI Punjab bowlers did their job before two Karnataka boys - KL Rahul and Mayank Agarwal - joined hands to form a match-winning 114-run stand to hand Sunrisers Hyderabad a six-wicket defeat, not before a bit of drama in the end, on a tricky Mohali surface on Monday (April 8).
#IPL2019KingsXIPunjab
#SunrisersHyderabad
#KLRahul
#MayankAgarwal
#ravichandranashwin
#bhuvaneswarkumar
#chrisgayle
#cricket

ఐపీఎల్‌ 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరో ఓటమి. మొహాలి వేదికగా సోమవారం పంజాబ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 151 పరుగుల లక్యాన్ని పంజాబ్‌ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.
పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ 53 బంతుల్లో 71 నాటౌట్‌(7 ఫోర్లు, 1 సిక్సర్‌) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌ 43 బంతుల్లో 55(3ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి.
అదే సమయంలో మయాంక్‌, మిల్లర్‌(1), మన్‌దీప్‌ సింగ్‌(2) వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో విజయం సన్‌రైజర్స్‌‌ను వరిస్తుందని అంతా భావించారు. కానీ, చివర్లో మరో బంతి మిగిలుండగానే పంజాబ్ విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ రెండు వికెట్లు తీయగా రషీద్‌ ఖాన్‌, కౌల్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
అంతకముందు డేవిడ్ వార్నర్ 62 బంతుల్లో 70 (4 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు చివర్లో దీపక్ హుడా 3 బంతుల్లో 14(2 ఫోర్లు, ఒక సిక్స్) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
Recommended