Date Fixed for Janasena First Candidates List? | Oneindia Telugu
  • 5 years ago
Pawan Kalyan met with party leaders Sunday. Pawan's comments were made on finalizing candidates. Janasana Party sources have claimed that they will release the assembly and the Lok Sabha first list in two days based on social equations and winning horses.
#andhra pradesh
#janasena
#pawankalyan
#nadenlamanohar
#guntur
#thotachandrashekar
#tdp
#ycp
#jagan
#chandrababu
#tdp

సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ, వైసీపీ కొందరు అభ్యర్థుల పేర్లను మాత్రమే ఖరారు చేశాయి. జాబితా మాత్రం కొలిక్కిరాలేదు. ఇందులో జనసేన పార్టీ ఒకడుగు ముందే ఉంది. రెండురోజుల్లో తమ తొలి జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేసింది.ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారనే ఊహాగానాల మధ్య ఆదివారం తమ పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ ముందుకొచ్చిన దరఖాస్తులను పరిశీలించి .. జనరల్ బాడీకి అందజేశారు. తర్వాత అభ్యర్థుల ఖరారుపై పవన్ సమాలోచనలు జరిపారు. అందరీ అభిప్రాయం తీసుకొని, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాల ఆధారంగా అసెంబ్లీ, లోక్ సభ ఫస్ట్ లిస్ట్ ను రెండురోజుల్లో విడుదల చేస్తామని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Recommended