Harish Rao Best Wishes to KTR for Appointed as TRS Working President | Oneindia Telugu
  • 5 years ago
Siddipet TRS leader Harish Rao says Hearty Congratulations to KT Rama Rao as he was appointed as TRS working president. During his first term, KCR gave more importance to KTR making him minister of IT, biotechnology, rural development and panchayat raj.
#TelanganaAssemblyelections
#TRSWorkingPresident
#KTR
#HarishRao
#KCR

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కేటీ రామారావును నియమించిన విషయం తెలిసిందే. కేటీఆర్‌కు కీలక పదవి దక్కడంపై పలువురు అభినందనలు తెలిపారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్ ఓ వైపు ముఖ్యమంత్రిగా పాలనపై దృష్టి సారిస్తూ ఢిల్లీ రాజకీయాల వైపు నడవనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని కేటీఆర్ చేతిలో పెట్టారు. పార్టీని నడిపించే బాధ్యతను అప్పగించారు. సభ్యత్వ నమోదు. జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతం బాధ్యతలు కేటీఆర్‌ తీసుకోనున్నారు. తెరాస పార్టీ చరిత్రలో తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు.
Recommended