India vs Australia 2018-19 : Virat Kohli Says He Was Immature During Early Days Of His Career
  • 5 years ago
Kohli told in a press conference. "I have enough belief in my ability to play. Those were very immature things that I needed to feed on in early days of my career.
#viratkohli
#indvsaus
#indiavsAustralia


కెరీర్‌ ఆరంభంతో పోల్చుకుంటే క్రికెటర్‌గా ఎంతో పరిణతి సాధించానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. గురువారం ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరడానికి ముందు అతడు విలేకర్లతో మాట్లాడాడు. 'కెరీర్‌ ఆరంభంలో దూకుడుగా ఉండేవాడిని. ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. నా సామర్థ్యంపై నాకు నమ్మకముంది. ఉద్వేగం తెచ్చుకోకుండా ఆడగలను. కెరీర్‌ ఆరంభంలో అపరిపక్వంగా వ్యవహరించా' అని కోహ్లి చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాట్స్‌మన్‌ రాణించాల్సిన అవసరముందన్నాడు. 'ప్రతి ఒక్క ఆటగాడూ బాధ్యత తీసుకోవాలి. అంచనాలను దృష్టిలో పెట్టుకుని జట్టుగా అనుకున్నదాని ప్రకారం ఆడాలి. కేవలం వ్యక్తిగతంగానే కాకుండా బ్యాట్స్‌మెనంతా సమష్టిగా ఎలా బాగా ఆడొచ్చో అనే దానిపై దృష్టిపెట్టాం' అని కోహ్లి అన్నాడు.
Recommended