T20I Match preview:Team India Practices well For Second Match

  • 6 years ago
A dominant win in the first T20I has set the tone and India would look to ensure that a spin-wary England remain on the back-foot when the two sides clash in the second T20I here on Friday (July 6)

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు సిరిస్‌పై కన్నేసింది. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం రాత్రి 10.00లకు(భారత కాలమాన ప్రకారం) జరగనుంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనుంది.
ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన మూడు టీ20ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచినట్లయితే మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ విజయం సాధించడంతో కోహ్లీసేన అలవోక విజయాన్ని నమోదు చేసింది.
దీంతో రెండో టీ20లో కూడా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో టీమిండియా ఉంది. గతేడాది నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా... ఆ తర్వాత జరిగిన అన్ని టీ20 సిరిస్‌ల్లోనూ విజయం సాధించింది.

Recommended