2017 కంటే కూడా ఈ ఏడాది వర్షాలు బాగా కురవనున్నాయి: ఐఎండీ

  • 6 years ago
Indian Meteorological Department (IMD) report predicted that heavy to very heavy rain at isolated places very likely over Assam and Meghalaya, Uttarakhand and Coastal Karnataka on Saturday.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాల ప్రకారం అస్సాం, మేఘాలయ, ఉత్తరాఖండ్, బెంగళూరుతోపాటు కర్ణాటక తీరప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వీటితోపాటు అరుణాచల్‌ప్రదేశ్, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ సిక్కిం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్, గోవా, విదర్భా, ఛత్తీస్‌గఢ్ శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గుజరాత్ రాష్ట్రంతోపాటు, రాజస్థాన్, ఉత్తర అరేబియా సముద్రం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఆవరించి ఉన్నాయి. జూన్ 29 నుంచి దాదాపు దేశ వ్యాప్తంగా రుతుపవనాలు ఆవరించాయి.
#monsoon
#mumbai
#weatherforecast
#karnataka

Recommended