జగన్ పై తీవ్రంగా మండిపడ్డ జే.సి దివాకర్ రెడ్డి
  • 6 years ago
Telugudesam Party, Anantapuram, MP JC Diwakar Reddy, on Friday lashed out at YSR Congress Party chief YS Jagan Mohan Reddy.

కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌కు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైయస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. కులాభిమానం ఉండవచ్చు కానీ దురభిమానం ఉండవద్దన్నారు.
మావాడు.. ఎవరు.. జగన్ అంటూ జేసీ మాట్లాడుతూ.. రాజకీయంగా ఆయనతో విభేదించినప్పటికీ, అతని పట్ల తనకు కొంత అభిమానం, ప్రేమ ఉందని చెప్పారు. అందుకు రెడ్డి కారణం అన్నారు. అందరికీ కులాభిమానం ఉందని చెప్పారు. అయితే కులాభిమాన దురహంకారం కాకూడదన్నారు. నేను పుట్టుకతోనే పెద్దరెడ్డిని అన్నారు.
ఎవరికైనా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అలాంటి వారిని అణగదొక్కడం సరికాదని జేసీ అన్నారు. తన కులం వాడికి అన్ని అర్హతలు ఉంటే వాడికి ఓటు వేస్తానని చెప్పారు. కానీ వేరే కులాన్ని అణగదొక్కనని చెప్పారు. నీకు కులాభిమానం ఉంటే నన్ను ఎందుకు తీసుకోలేదని (వైసీపీలోకి), అసలు నీవు ఎందుకు రాలేదని అడిగారు. నీకు రూ.30 కోట్లు ఇచ్చి పార్టీలో చేరాలా అని ప్రశ్నించారు. ఏయ్.. మళ్లీ చెప్తున్నా.. నేను పుట్టుకతో పెద్ద రెడ్డిని, మా తాతకు 2వేల ఎకరాల భూమి ఉండేదని, మీ తాతకు ఎంత ఉండేదో చెప్పాలన్నారు.
Recommended