Fifa World Cup 2018 : Croatia Won Against Argentina
  • 6 years ago
Argentina employed the 4-2-3-1 formation against Iceland in their first group match that ended in a 1-1 draw. Sampaoli went for 3-4-3 system against Croatia. It was a sharp change to make in a short time as pointed out by experts like Cesc Fabregas.

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్టార్ ప్లేయర్లు ఉన్న అర్జెంటీనాకు భారీ షాకిచ్చింది. గురువారం జ‌రిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు పేలవ ప్రదరన చేసింది. వరల్డ్ కప్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా దారుణంగా విఫలమైంది.
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై క్రొయేషియా 3-0తేడాతో ఘన విజయం సాధించింది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ప్రత్యర్ధి జట్టు డిఫెండర్లు బలంగా అడ్డుకున్నారు. దీంతో క్రొయేషియా ఈ మ్యాచ్‌లో 3-0తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి క్వార్ట‌ర్స్‌కు త‌న స్థానాన్ని దాదాపు ఖ‌రారు చేసుకుంది.
మ్యాచ్ ఆరంభం నుంచీ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, రెండో అర్ధభాగంలో మాత్రం అర్జెంటీనాపై క్రొయేషియా పైచేయి సాధించింది. అర్జెంటీనా గోల్ కీప‌ర్ కాబ‌రెల్లో ఛేసిన త‌ప్పు క్రొయేషియాకు తొలి గోల్‌ను అందించింది. ఆట 53వ నిమిషంలో రెబిక్ మొద‌టి గోల్ చేసి క్రొయేషియాకు ఆధిక్యాన్ని అందించాడు.
Recommended