ICC Cricket World Cup 2019: Pak Won By 14 Runs On England | Match Highlights
  • 5 years ago
Pak defeated tournament hosts England by 14 runs in the second match of their World Cup 2019 campaign. England got off to a poor start as Jason Roy was dismissed by Shadab Khan in the third over. Jonny Bairstow and Joe Root added 48 runs for the second wicket. Bairstow fell to Wahab Riaz. Skipper Eoin Morgan and Ben Stokes both got out cheaply. Root and Jos Buttler both completed their century and kept England chase alive. Root got out to Shadab Khan while Wahab Riaz stuck twice in two balls to force England on the backfoot.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#england
#pak
#morgan
#sarfaraz

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ చతికిలపడింది. పాక్ 14 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో రూట్ (107), జోస్ బట్లర్ (103)లు సెంచరీలతో కదం తొక్కినప్పటికీ మిగితా బ్యాట్స్ మెన్ ఆశించినంత మేర రాణించపోవడంతో కీలక సమయాల్లో వికెట్లు పడటంతో ఇంగ్లాండ్ ఛేదనలో వెనుకంజ వేసింది. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసి లక్ష్యానికి 15 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో ఓపెనర్లు బెయిర్ స్టో 32 పరుగులు చేయగా, జాసన్ రాయ్ కేవలం 8 పరుగులు చేసి వెనుదిరగడంతో ఇంగ్లాండ్ శుభారంభాన్ని అందుకోలేకపోయింది. మరో కీలక బ్యాట్స్ మెన్ ఇయాన్ మోర్గన్ (9), బెన్ స్టోక్స్ (13) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో ఒత్తిడి మొత్తం బట్లర్, రూట్ పైనే పడింది. మరోవైపు పాకిస్థాన్ బౌలర్లు సైతం రెగ్యులర్ గా వికెట్లను పడగొట్టడంలో విజయం సాధించారు. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్ 3 వికెట్లు పడగొట్టగా, మహ్మద్ ఆమీర్, షాదాబ్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా, హఫీజ్, షోయబ్ మాలిక్ చెరో వికెట్ పడగొట్టారు.
Recommended