Peru Abuzz About First World Cup In 36 years After Guerrero Boost

  • 6 years ago
From the peaks of the Andes to the jungles of the Amazon, Peru is rejoicing even before a ball has been kicked at the World Cup, because they are finally going to have their star player Paolo Guerrero with them.
#fifaworldcup2018
#footballworldcup
#russiaworldcup
#football

అండీ పర్వత శిఖరాలు మొదలు అమెజాన్ అడవుల వరకు పెరూ వాసులంతా మరో 11 రోజుల్లో ప్రారంభం కానున్న రష్యా 'సాకర్ కప్' సంరంభం కోసం ఆసక్తిగా, ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టార్ ప్లేయర్ పాలో గౌర్రెరో గైర్హాజరీలో ఉండగా తమ జట్టు విజయావకాశాలపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అర్హత సాధించి ఆరంగ్రేటం చేస్తోంది.
డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కెప్టెన్ పాలో గౌర్రెరో లేకుండా, అర్జెంటీనా మాజీ ఇంటర్నేషనల్ కం కోచ్ రికర్డో గారెసా సారథ్యంలో తాము సాధించిన అర్హతకు తగినట్లు ఆడతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పెరువియన్ ఫుట్‌బాలర్లకు హీరోగా నిలిచిన మేనేజర్ రికర్డో గారెసా సారథ్యంలో కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తున్న పెరు ఆటగాళ్లు తాము ఎదుర్కొన్న అన్ని అడ్డంకులకు పిచ్‌పై సమాధానం చెబుతామంటున్నారు.

Recommended