I Quit Cricket Administration After Lodha Age Limit Says Vinod Rai

  • 6 years ago
Rai, the chairman of the Supreme Court-appointed committee of administrators (CoA) for the Board of Control for Cricket in India (BCCI), celebrated his 70th birthday Wednesday, leaving many in the fraternity wondering if he will resign.
#vinodrai
#cricket
#bcci
#india

బీసీసీఐ పరిపాలకుల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న వినోద్ రాయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వయసు దాటిపోయినా ఇంకా అదే పదవిలో ఎలా కొనసాగుతారు.? అని ప్రశ్నిస్తున్నారు. లోధా కమిటి చేసిన సూచనల ప్రకారం.. 70 ఏళ్లు వయో పరమితి దాటిన వాళ్లంతా ఆ పదవికి అనర్హులు. ఈ క్రమంలో వినోద్ రాయ్ గురువారం నాటికి 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో.. బోర్డులో సంస్కరణలను అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న పరిపాలకుల కమిటీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌పై చర్చ మొదలైంది. పరిమితి దాటినా ఎలా కొనసాగగలడనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.
'ఇప్పుడు వినోద్‌ రాయ్‌కి 70 ఏళ్లు నిండాయి. ఇప్పుడు కూడా అతడు బోర్డు సమావేశాలకు హాజరవుతాడా? లేదా బీపీసీని పాలిస్తున్నందున, సుప్రీంకోర్టు నియమించినందున సీఓఏ సభ్యులకు నిబంధనలేమైనా భిన్నంగా ఉంటాయా?' అని నిరంజన్‌ షా అన్నాడు. వయోపరిమితి నిబంధన కారణంగా బీసీసీఐలో పదవులు చేపట్టకుండా అనర్హుడైన తొలి వ్యక్తి షానే కావడం గమనార్హం.

Recommended