IPL2018 : CSK Beat SRH To Enter IPL Final
  • 6 years ago
Only one man seemed to have a heart ticking in normal rate inside of a cauldron like Wankhede Stadium - Faf du Plessis. Came in as opener, Faf saw Chennai Super Kings wickets falling around him like candyfloss flying away in storm. The South Africa captain made a composed unbeaten 67 off 42 balls that contained five fours and four sixes to take Super Kings to 140/8 in 19.1 overs, to a two-wicket win over Sunrisers Hyderabad and to their seventh IPL final here on Tuesday (May 22). Meanwhile, Sunrisers will play the Qualifier 2 on Friday at Kolkata against the winners of Eliminator match between Kolkata Knight Riders and Rajasthan Royals on Wednesday.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సీఎస్‌కేనే పైచేయి సాధించింది. ఫలితంగా తొలి ఫైనల్‌ బెర్తును సీఎస్‌కే ఖరారు చేసుకుంది. సీఎస్‌కే ఆటగాడు డుప్లెసిస్‌(67 నాటౌట్‌; 42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిచిపించాడు.
సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే తడబడింది. 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షేన్‌వాట్సన్‌ డకౌట్‌గా తొలి వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరగా, సురేశ్‌ రైనా(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై వెంటనే అంబటి రాయుడు డకౌట్‌గా నిష్ర్కమించాడు. దాంతో సీఎస్‌కే 24 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో ఎంఎస్‌ ధోని(9) క్లీన్‌బౌల్డ్‌ కాగా, బ్రేవో(7), జడేజా(3)లకు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన డుప్లెసిస్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బాధ్యతాయుతంగా ఆడి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Recommended