IPL 2018 Playoffs : Battle Heats Up for Last Two Positions
  • 6 years ago
It’s the penultimate week of the Indian Premier League and till now the four teams for the playoffs haven’t been decided. Only Sunrisers Hyderabad and Chennai Super Kings have qualified for the final four.
#IPL2018
#KingsXiPunjab
#RajasthanRoyals
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#KolkataKnightRiders


ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన సన్‌రైజర్స్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. బెంగళూరు విజయంతో రేసు ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో మరో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉండగా.. సన్‌రైజర్స్, చెన్నై మాత్రమే ప్లేఆఫ్ చేరాయి. మరో రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. మరి ప్లేఆఫ్ చేరడానికి ఈ ఐదు జట్ల ముందున్న అవకాశాలేంటో చూద్దాం.
కోల్‌కతా నైట్‌రైడర్స్:
శనివారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కోల్‌కతా ఖాతాలో 16 పాయింట్లు చేరతాయి. ఓడితే మాత్రం బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడాలని ఆ జట్టు కోరుకోవాల్సిందే. రాజస్థాన్, పంజాబ్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటం కోల్‌కతాకు కలిసి వచ్చే అంశం.
ముంబై ఇండియన్స్
పంజాబ్‌పై మూడు పరుగుల తేడాతో గెలవడంతో.. ముంబై ఇండియన్స్ రన్‌రేట్ 0.405 నుంచి 0.384కి పడిపోయింది. రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కోహ్లిసేన భారీ తేడాతో నెగ్గితే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్ చేరుతుంది. అలా జరగొద్దంటే రోహిత్ సేన ఢిల్లీపై భారీ విజయం సాధించాలి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
సన్‌రైజర్స్‌పె గెలిచిన బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే మెరుగైన రన్‌రేట్ ఉన్న కోహ్లి సేన తదుపరి దశకు చేరుకునే ఛాన్స్‌లు ఎక్కువ.
రాజస్థాన్ రాయల్స్:
రహానే జట్టు ప్లేఆఫ్ చేరాలంటే బెంగళూరుపై గెలవడంతోపాటు ఢిల్లీ చేతుల్లో ముంబై ఓడాలి. ఒకవేళ చెన్నై మీద పంజాబ్ గెలిచినా..మెరుగైన రన్‌రేట్ ఉండటంతో రాజస్థాన్ తదుపరి దశకు చేరుతుంది. నెట్ రన్‌రేట్ తలనొప్పులు తప్పాలంటే.. ఆర్‌సీబీపై భారీ తేడాతో రాజస్థాన్ గెలవాలి.
Recommended