IPL 2018: Rajasthan Royals Win Over Royal Challengers Bangalore
  • 6 years ago
With a big total to chase, RCB wasted no time in getting off the blocks. However, that proved to be their undoing as the pursuit of the big shots led to their downfall. All their top four batsmen - Brendon McCullum, Quinton de Kock, Virat Kohli and AB de Villiers - were caught in the deep while trying to clear the ropes.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చీ రావడంతోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన కోహ్లీ బౌండరీల వర్షం కురిపించాడు. అత్యంత వేగంగా ఆడిన విరాట్ కోహ్లీ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కుని అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 152 మ్యాచ్‌లాడిన విరాట్ 4527 పరుగులు చేశాడు. ఇందుల్లో నాలుగు సెంచరీలు ఉండగా.. 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్‌లో 4500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సురేశ్ రైనాతో జత కలిశాడు. అంతేకాదు ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ 26,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో శ్రేయాస్ గోపాల్ వేసిన రెండో బంతిని డీప్ వికెట్ దిశగా బాదాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షార్ట్ అద్భుతమైన క్యాచ్‌కు విరాట్ (57:30 బంతుల్లో 7ఫోర్లు 2సిక్స్‌లు) పెవిలియన్‌కు చేరాడు
ఇదిలా ఉంటే సొంతగడ్డపై చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు రాజస్థాన్ షాకిచ్చింది. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుపై రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు సంజు శాంసన్(92 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో రాజస్థాన్ 4 వికెట్లకు 217 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్ రహానే మంచి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ షార్ట్(11) పరుగులు సాధించడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. మరోసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయక నిరాశ పరిచాడు. ఆరంభంలో ఎక్కువ బంతులాడిన రహానె వేగంగా పరుగులు సాధించాడు. జట్టు స్కోరు 49 వద్ద రహానె వెనుదిరిగగా.. 59 వద్ద షార్ట్ ఔటయ్యాడు.
ఈ దశలో క్రీజులో ఉన్న యువ క్రికెటర్ సంజు శాంసన్(92నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడాడు. తన మార్క్‌షాట్లతో సునాయాసంగా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(27) నిదానంగా ఆడుతూ శాంసన్‌కు సహకారం అందించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో సంజు సిక్సర్లే బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 10 సిక్సర్లు బాదిన శాంసన్ జట్టు స్కోరును 200 దాటించాడు. ఇంకో రెండు మూడు బంతులుంటే సెంచరీ కూడా పూర్తయ్యేది.
Recommended